లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మూడురోజుల నష్టాల తర్వాత మంగళవారం ఉదయం లాభాలతో బెంచ్‌మార్క్‌ సూచీలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 261.16 పాయింట్ల లాభంతో 66,428.09 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79.75 పాయింట్లు లాభపడి 19,811.50 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.26 వద్ద కొనసాగుతుంది.