మా సభ్యత్వంపై మంచు విష్ణు కీలక నిర్ణయం

మా అధ్యక్షుడు మంచు విష్ణు మా సభ్యత్వంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు మా అసోసియేషన్ సభ్యత్వం అనేది తెలుగు నటి నటులకు మాత్రమే ఉండేది. వీరికి మాత్రమే మా బెనిఫిట్స్ లభించేవి.. అయితే ఇకపై తెలుగు చిత్రాలలో నటించే బాలీవుడ్ వారికి కూడా మా సభ్యత్వం లభించేలా వారికి మా అసోసియేషన్ నుంచి వచ్చే పథకాలు కూడా అందేలా మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని కలిసి వారితో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ..” మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు బాలీవుడ్ అసోసియేషన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలలో పనిచేసే బాలీవుడ్ కళాకారులకు కూడా మా సభ్యత్వం అందుతుంది. అలాగే తెలుగు నటీనటులు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తే వాళ్ళకి కూడా బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం లభిస్తుంది అని తెలిపారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు మా అసోసియేషన్ వాళ్లకు అండగా ఉంటుందని.. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా లభిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందం ఒక బాలీవుడ్ కే పరిమితం కాదు అని.. త్వరలోనే మిగతా ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుందని ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబంలా ఉండాలనేదే తన కోరిక అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.