విలన్‌గా మంచు మనోజ్‌..?

మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే మాట్లాడుకుంటున్నారు. ఝుమ్మంది నాదం మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్..ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ స్టార్ హీరో స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయారు. 2019 నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్..‘వాట్‌ ది ఫిష్‌’ అంటూ నాలుగు నెలల క్రితం కొత్త సినిమాను ప్రకటించాడు. టైటిల్‌తోనే సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ఆ వెంటనే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌, టైటిల్ గ్లింప్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.

ప్రస్తుతం మళ్లీ సినిమాల ఫై ఫోకస్ చేసి రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇదే క్రమంలో విలన్ పాత్రలకు కూడా ఓకే చెపుతున్నాడట. కలర్‌ ఫోటో దర్శకుడు సందీప్‌ రాజ్‌ ఇటివలే రవితేజ తో సినిమాను ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో హీరోకు ఏ మాత్రం తగ్గకుండా విలన్‌ పాత్ర ఉండనుందట. అందుకోసం మనోజ్‌ అయితేనే బెటర్‌ అని సందీప్‌ ఆయనను కలిసి కథ వినిపించాడట. మనోజ్‌ కూడా ఇంప్రెస్‌ అయినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ కూడా నటించనున్నాడని టాక్‌. ఇలా మొత్తానికి సందీప్‌ భారీ మల్టీస్టారర్‌నే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఒకవేళ మనోజ్‌కు మాత్రం సరైన విలన్‌ పాత్ర పడితే మాత్రం వేరే లెవల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.