అమిత్ షా తో కోమటిరెడ్డి రాజగోపాల్ భేటీ ..

కోమటిరెడ్డి రాజగోపాల్..కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక రాజగోపాల్ కాంగ్రెస్ ను విడి బిజెపి లో చేరిన సంగతి తెలిసిందే. అంతే కాదు తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసాడు. దీంతో ఇప్పుడుమునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఈ ఉప ఎన్నిక జరగనుంది. బిజెపి నుండి రాజగోపాల్ రెడ్డి దిగుతున్నారు. ప్రస్తుతం బిజెపి సైతం మునుగోడు ఫై ఫోకస్ చేసింది.

మునుగోడు లో రాజగోపాల్ ను గెలిపించి , తెలంగాణ లో సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే కీలక నేతలంతా కూడా ప్రచారం మొదలుపెట్టారు. బిజెపి మంత్రులు సైతం ఎప్పటికప్పుడు మునుగోడు రాజకీయాల ఫై ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాజగోపాల్.. అమిత్ షాతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల‌పైనే కేంద్ర మంత్రితో చ‌ర్చించారు. మునుగోడులో బీజేపీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌తో పాటుగా ఇత‌ర పార్టీల ఎన్నిక‌ల వ్యూహాల‌పైనా ఆయ‌న అమిత్ షాతో చ‌ర్చించారు.