అప్పటికప్పుడు.. చక్కని నిగారింపు!

అందమే ఆనందం

Makeup Tips
Makeup Tips

శీతాకాలం సుఖం త్వరగా పొడిబారిపోతుంది. తేమను కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది.

ఇంట్లో దొరికే పదార్థాలతోనే మృదువుగా, అందమైన చర్మాన్ని సొంతం చేసుకోఆలంటే ఇలా చేసి చూడండి..

రండు చెంచాల సెనగపిండిలో చెంచా పెరుగు, అరచెంచా నిమ్మరసంవేసి కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి.

Makeup Tips
Makeup Tips

ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. కొంచెం గంధం పొడిలో రెండు చెంచాల రోజ్‌ వాటర్‌ను కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా చేయడంవల్ల చర్మం నిగారింపుతోపాటు మృదువుగానూ మారుతుంది .

చెంచా అరటి పండు గుజ్జులో అరచెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డుగా కాకుండా మృదువుగా మెరుస్తుంది.

నాలుగైదు బాదం పప్పులను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులో సరిపడా పాలు పోసి పేస్టులా చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి సరిపడా తేమఅంది సహజ నిగారింపు వస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/