మహేష్ బాబు స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా…

మహేష్ బాబు స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా…

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు అని చెప్పాల్సిన పనిలేదు. 46 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ, ఇంకా 25 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న మహేష్..తాజాగా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ లుక్ లో మహేష్ కాస్ట్లీ బైక్ ఫై స్టైలిష్ గా కూర్చొని , చేతిలో మొబైల్ పట్టుకొని పోజ్ ఇచ్చాడు. మరి ఈ లుక్ ఏదైనా కమర్షియల్ యాడ్ కోసమా..లేక తన కొత్త సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్. అలాగే ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉండనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు.