సీఏఏను అమలు చేస్తే తప్పేం లేదు!

పౌరసత్వ సవరణ చట్టంకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Hardeep Singh Dang
Hardeep Singh Dang

భోపాల్‌: కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టంకు తాను మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్‌దీప్‌ సింగ్‌ దుంగ్‌ ప్రకటించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్థాన్‌లో ఉండే మన సోదరులు ఇక్కడకి వస్తే వారికి హక్కులు కల్పిచడంలో ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. వారికి ఇక్కడ పౌరసత్వం కల్పిస్తే జరిగే ప్రమాదేమీ లేదన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను రెండు వేరని వాటిని కలిపి చూడవద్దన్నారు. సీఏఏ అమలు చేస్తే తప్పేం లేదని హర్‌దీప్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ నియామలకు విరుద్ధంగా హర్‌దీప్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటి సారి కాదని తెలుస్తుంది. గతంలో కూడా జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పుడు కూడా ఆయన మద్దతు ఇచ్చారు. అయితే సీఏఏకు మద్దతుగా ప్రచారంలో భాగంగా అమిత్‌ షా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/