రాహుల్ ఫై బిజెపి ఎంపీ అరుణ ఫైర్

లోక్ సభలో రాహుల్ గాంధీ హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మహబూబ్ నగర్ లో మాట్లాడిన ఆమె.. ప్రతిపక్ష నేత అసలు విషయాలు పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాహుల్ వ్యాఖ్యలను కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని దుయ్యబట్టారు.