సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ టీజ‌ర్‌ విడుదల

ప్రస్తుతం సినీ లవర్స్ వెబ్ సిరీస్ లపై మక్కువ పెంచుకున్నారు. దీంతో చిన్న చితక నటీనటులే కాదు అగ్ర హీరోలు , హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా సుశాంత్ డిజిట‌ల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సుశాంత్ న‌టిస్తోన్న తాజా వెబ్ సిరీస్‌ ‘మా నీళ్ల ట్యాంక్’. వ‌రుడు కావ‌లెను ఫేమ్ డైరెక్టర్ ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. లీడ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ప్రియా ఆనంద్ లాంగ్ గ్యాప్‌ త‌ర్వాత ఈ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుండి టీజర్ ను విడుదల చేసి అంచనాలు పెంచారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ‌న్నీ ట్రాక్‌తో జీ 5 ఒరిజిన‌ల్ ఉంబోతుంద‌ని చెప్పేసింది ల‌క్ష్మీ సౌజ‌న్య‌. మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌లో సుద‌ర్శ‌న్‌, నిరోశ్‌, ప్రేమ్ సాగ‌ర్, రామ రాజు, అన్న‌పూర్ణ‌మ్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌వీణ్ కొల్ల నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ జులై 15న ప్రీమియ‌ర్ కానుంది. ఈ టీజర్ ఫై మీరు లుక్ వెయ్యండి.

YouTube video