CID నోటీసుల ఫై లోకేష్ రియాక్షన్

అమరావతి రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు నోటీసులు అందుకున్నారు. ఢిల్లీ లో ఉన్న ఆయనకు cid అధికారులు నోటీసులు అందజేసి..అక్టోబర్ 04 న విచారణ కు హాజరుకావాలని సూచించారు. నోటీసులు అందుకున్న లోకేష్ మీడియా స్పందించారు.

“సీఐడీ అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయింది. లేని కేసులు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే లేదు… కానీ పెద్ద కుంభకోణం జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు. అందులో నాపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సీఐడీ అధికారులు నా వద్దకు వచ్చినప్పుడు… “మేం ఢిల్లీకి వస్తే లోకేశ్ కనబడడంలేదు, లోకేశ్ అక్కడున్నాడు, ఇక్కడున్నాడు” అంటూ మీరు ఎందుకు మాట్లాడారని వాళ్లను అడిగాను. అందుకు వాళ్లేమన్నారంటే… మేం ఈ ఉదయమే విమానంలో ఢిల్లీ వచ్చాం. నేరుగా మీ వద్దకే వచ్చి నోటీసులు ఇస్తున్నాం… అంతేతప్ప, మీ కోసం ఇంతకుముందెప్పుడూ మేం ఢిల్లీకి రాలేదు అని వాళ్లు కూడా స్పష్టంగా చెప్పారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చిన సీఐడీ అధికారులకు కాఫీ, టీలు ఇచ్చి నోటీసులో ఉన్నదంతా చదివి సంతకం పెట్టాను. అందులో ఉన్న సెక్షన్లపై నాకు పెద్దగా అవగాహన లేకపోవడంతో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆ సెక్షన్లను వివరించారు. నూటికి నూరు శాతం విచారణకు హాజరవుతాను. అందులో సందేహమే అక్కర్లేదు. వాళ్లలాగా వాయిదాలు అడగను అన్ని స్పష్టం చేసారు.