దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్ డౌన్ భారం

ఏప్రిల్ లో 27.4కి పడిపోయిన పీఎంఐ

Lockdown burden on the economy of the country

హైదరాబాద్‌: కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో భారత ఉత్పత్తి రంగం రికార్డు స్థాయి క్షీణత చవిచూస్తోంది. ఎన్నడూ లేనంతగా దేశీయ తయారీ రంగం పాతాళానికి పడిపోయింది. ఎక్కడికక్కడ ఆంక్షలు, అనేక సంస్థలు ఉద్యోగులను తగ్గించుకోవడం, రవాణా పరిమితులు వంటివి ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పతనమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మార్చిలో 51.8గా ఉన్న పీఎంఐ, ఏప్రిల్ నెలలో 27.4కి పడిపోయింది. పీఎంఐ డేటా సేకరించడం మొదలైన 15 ఏళ్లలో ఇదే అత్యంత భారీ పతనం అని ప్రముఖ విశ్లేషణ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/