బిగ్ బాస్ హౌస్ లో సేవకుడిగా మారిన లోబో ..

బిగ్ సీజన్ 5 తెలుగు లో గ్రాండ్ గా మొదలైంది. అన్ని సీజన్ల మాదిరిగానే హౌస్ లో అల్లర్లు , గొడవలు , ఏడుపులు , ప్రేమలు మొదలయ్యాయి. ఈసారి హౌస్ లోకి ఏకంగా 19 మంది వెళ్లడం తో మూడో రోజు నుండి సభ్యుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం , సారీ లు చెప్పుకోవడం , వల్గర్ గా మాట్లాడుకోవడం చేసారు. ఈసారి సబ్యులకు కొత్తగా పవర్ రూమ్ అనే అప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ పొందిన వారు ఇద్దరు సభ్యులకు ఏదైనా పని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే విశ్వ, మానస్‌ పవర్ రూమ్ యాక్సెస్‌ పొందడం జరిగింది. విశ్వ రవి, నటి ప్రియకు పనిష్మెంట్‌ ఇచ్చారు. మానస్‌ అయితే ఆర్జీ కాజల్‌కు చాలా కష్టమైన టాస్కే ఇచ్చారు. ఇంటి సభ్యులు అందరూ నిద్రపోయాకే పడుకోవాలంటూ గట్టి టాస్క్‌ ఇచ్చారు.

మూడోసారి పవర్‌ రూమ్‌లోకి యూట్యూబర్‌ సిరి హన్మంతు వెళ్లింది. తనకు ఇద్దరికి ఎంపిక చేసుకుని వారిలో ఒకరు సేవకుడిగా ఉండేలా ఆదేశించాలని సూచించారు. సిరి లోబో, షణ్ముఖ్‌లను సెలక్ట్‌ చేసింది. లోబో షణ్మఖ్‌కు సేవలు చేయడం, ఒళ్లు పట్టడం చేస్తున్నాడు. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి చేస్తానంటూ సేవకుడిలా మారిపోయాడు. ‘అరె ఏంట్రా ఇది?’ అనే షణ్ముఖ్‌ ఫేమస్‌ డైలాగ్‌ను ఈసారి లోబో చెప్పడం హైలెట్‌గా మారింది. మరి ఈరోజు షో ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి. https://www.youtube.com/embed/3uUnQOuELzc