బిగ్ బాస్ 5 : అరే రవి నాకు టైం వస్తుంది..అప్పుడు చూసుకుంటా – లోబో

బిగ్ బాస్ 5 : అరే రవి నాకు టైం వస్తుంది..అప్పుడు చూసుకుంటా - లోబో

బిగ్ బాస్ సీజన్ 5 నాల్గు రోజులు పూర్తి చేసుకుంది..రోజు రోజుకు షో ఫై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. నిన్నటి వరకు గొడవలు , ఏడుపులతో సాగిన షో..నాల్గో రోజు నవ్వుల్లో ముంచేసింది. దీనికి కారణం లోబో. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ కమెడియన్ డిఫెరెంట్ యాసతో అలరిస్తున్నాడు. అతడి మేనరిజమే పూర్తి డిఫెరెంట్ గా ఉంటుంది. లోబోను ఒకసారి చూసిన వాళ్లు ఎవరూ జీవితంలో అతడిని మరిచిపోలేరు. అతడి వేషధారణ ప్రవర్తన అంతా డిఫెరెంట్ గా ఉంటుంది.

రోజు రోజుకు హౌస్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. నాల్గో రోజు తన కామెడీ తో అందర్నీ నవ్వుల్లో ముంచేశాడు. కేవలం హౌస్ సభ్యులనే కాదు షో చూస్తున్న ప్రేక్షకులను సైతం నవ్వించేసాడు. పవర్ రూమ్ దక్కించుకున్న సిరి..షణ్ముఖ్ ను యజమాని, లోబో అతడికి సేవ చేసే సేవకుడిగా ఉండాలని ఆదేశించింది. దీంతో లోబో షణ్ముఖ్ చెప్పిన పనులు చేస్తూ నవ్వులు పోయించాడు. ముఖ్యంగా బాత్ రూమ్ లో షణ్ముఖ్ బట్టలు పిండుతున్నప్పుడు..రవి వచ్చి ఆ బకెట్ నాది..దానిని శుభ్రంగా కడగమని లోబో కు ఆర్డర్ వేస్తాడు. ఆ టైం లో లోబో…అరే రవి..నాకు టైం వస్తుంది అప్పుడు చెపుతా అంటూ తనదైన యాస లో చెప్పి ప్రేక్షకులను నవ్వించాడు.