లిక్కర్ స్కామ్ కేసు.. అభిషేక్ బోయినపల్లికి బెయిల్ నిరాకరణ

liquor-scam-case-bail-denied-to-abhishek-boinapalli

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడి.. జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసిన కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయినపల్లి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం హాజరుకావాల్సి ఉందని.. బెయిల్ ఇవ్వాలని కోరారు ఆయన. స్కూల్ లో పిల్లల అడ్మిషన్ కోసం నేరుగా హాజరుకావాల్సి ఉందని.. వారి భవిష్యత్, చదువులను దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో స్పష్టం చేశారు అభిషేక్ బోయినపల్లి.

ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా.. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వటం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ. విచారణ పూర్తి కాకుండా బెయిల్ ఇవ్వొద్దని.. నిందితులు, అనుమానితులందరి విచారణ ఇంకా కొనసాగుతుందని కోర్టులో ఈడీ స్పష్టం చేసింది. పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ పిటీషన్ పై విచారణను 2023, ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.