లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి అనన్య పాండే టాలీవుడ్ కి ఒకే సారి పరిచయం కానున్నారు.

విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇక పూరి కూడా ఈ సినిమాను ఎక్కడ తగ్గకుండా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా కీలక పాత్రలో బాక్సింగ్ లెజెండ్ మైక్‌ టైసన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండడంతో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్ . వచ్చే ఏడాది ఆగస్టు 25వ తేదీన లైగర్ సినిమాను థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే డిసెంబర్ 31, 2021 కి ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తున్నట్లు టైగర్ టీం పేర్కొంది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేయ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పూరి త‌న‌దైన స్టైల్లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తున్నారు.