ఘోర విమాన ప్రమాదం.. 9 మంది మృతి

న్యూఢిల్లీ: కరేబియన్ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. డొమినికన్ రిపబ్లిక్ లో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు సిబ్బంది కాగా.. ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ విమానం డొమినికన్‌లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వెళ్తున్నది. విమానాశ్రయంలో టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలింది. ఏడుగురు ప్రయాణికుల్లో ఆరుగురు విదేశీయులు కాగా, ఒకరు డొమినికన్ అని విమాన ఆపరేటర్ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ ట్వీట్ చేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/