కుప్పం లో టెన్షన్..టెన్షన్

కుప్పం లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కుప్పం లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు కు వ్యతిరేకంగా ప్లెక్సీలు కట్టడం..పర్యటన కు అడ్డుకోవడం వంటివి చేస్తుండడంతో టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న బుధువారం చంద్రబాబు రామకుప్పం మండలం కొల్లుపల్లి లో పర్యటిస్తుండగా.. టీడీపీ, వైస్సార్సీపీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్లదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. దీంతో వైస్సార్సీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కొల్లుపల్లి లో వైస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి కి నిరసనగా కుప్పంలో వైఎస్సార్ విగ్రహం వరకు వైస్సార్సీపీ నిరసన ప్రదర్శన చేస్తుంది.

చంద్రబాబు పర్యటన ను వైస్సార్సీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే దీటుగా సమాధానం చెప్పేందుకు టీటీపీ నేతలు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ మేరకు టీటీపీ కార్యకర్తలు, అభిమానులు కుప్పంకు చేరుకోవాలని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల శ్రేణులు భారీగా కుప్పంకు చేరుకుంటున్నారు.

వైస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల పోటాపోటీ నిరసనలు, బల ప్రదర్శనలకు రెడీ అవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ ఆదేశాలతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అంతేకాదు విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఎప్పటికప్పుడు కుప్పంలో పరిస్థితిని పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇతర జిల్లాల పోలీసు బలగాలు కుప్పానికి పిలిపించారు.