భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేది అప్పుడేనట..

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ భీమ్లా నాయక్. నిత్యా మీనన్ , సంయుక్త హీరోయిన్లు గా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , థమన్ సంగీతం లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ లు , టీజర్ లు ప్రేక్షకులను , అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా..అసలైన ట్రైలర్ కోసం అంత ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో ఈ ట్రైలర్ తాలూకా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 14న 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న రానా. ఈ సందర్భంగా ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ ట్రైలర్ ను విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. దాదాపు ట్రైలర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.