ప్రీమియం ఆదాయంలో దూసుకుపోతున్న ఎల్‌ఐసీ

lic-new-business-premium-crosses-rs-15-lakh-crore
lic-new-business-premium-crosses-rs-15-lakh-crore

ముంబయి: ప్రైవేటు కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఉన్నా ఐపీఓకు రానున్న ఎల్‌ఐసీ, వ్యాపారంలో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో (2019 ఏప్రిల్‌ 2020 జనవరి).. సంస్థ కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు మించిపోయాయి. కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువ భాగం తొలిసారిగా వ్యక్తిగత పాలసీలు తీసుకున్న వారు చెల్లించిన ప్రీమియం ద్వారా సమకూరిందని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ప్రీమియం 17.48 శాతం పెరిగింది. అమ్మిన పాలసీల సంఖ్య కూడా 29.42 శాతం పెరిగాయి. ఈ పాలసీల ద్వారా ఎల్‌ఐసీకి రూ.45,199 కోట్ల కొత్త ప్రీమియం సమకూరింది. దీంతో ప్రీమియం వసూళ్లలో మార్కెట్‌ వాటా 66.26% నుంచి 70.02 శాతానికి పెరిగింది. పాలసీలపరంగా చూసినా మార్కెట్‌ వాటా 73.54ు నుంచి 77.61 శాతానికి చేరింది. గత 10 నెలల్లో పెన్షన్‌, గ్రూప్‌ పథకాల ద్వారానే ఎల్‌ఐసీ రూ. 1.05 లక్షల కోట్ల కొత్త వ్యాపార ప్రీమియం వసూలు చేసింది. వివిధ సామాజిక పథకాల కింద ఎల్‌ఐసీ గత పది నెలల్లో 2.45 కోట్ల మందికి బీమా సదుపాయం కల్పిచింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/