కరోనాను జయించిన దేశాధినేతలు

విజయాల పరంపరలో అతివలు

ANGELA MERKEL- KATRIN JOCKABS-ERNA SOLBURGE
ANGELA MERKEL- KATRIN JOCKABS- ERNA SOLBURGE

కరోనా విజృంభణతో ఐరోపా దేశాలు వణికిపోతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. జర్మనీ మాత్రం కరోనాను కట్టడి చేయగలిగింది.

జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కరోనా కట్టడి విషయంలో కీలక పాత్ర పోషించారు. ఎనిమిదిన్నర కోట్ల జనాభా. వీలైనంత వరకు పరీక్షలు నిర్వహించడమే మంచిదనుకున్నారు.

అందుకు ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌ విధానాన్ని ఎంచుకున్నారు.

లక్షల టెస్టింగ్‌ కిట్లను సిద్ధం చేశారు. ఇళ్ల వద్దనే పరీక్షలు నిర్వహించారు.

కరోనా విజృంభణతో ఐరోపా దేశాలు వణికిపోతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. జర్మనీ మాత్రం కరోనాను కట్టడి చేయగలిగింది.

జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కరోనా కట్టడి విషయంలో కీలక పాత్ర పోషించారు. ఎనిమిదిన్నర కోట్ల జనాభా. వీలైనంత వరకు పరీక్షలు నిర్వహించడమే మంచిదనుకున్నారు.

అందుకు ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌ విధానాన్ని ఎంచుకున్నారు. లక్షల టెస్టింగ్‌ కిట్లను సిద్ధం చేశారు. ఇళ్ల వద్దనే పరీక్షలు నిర్వహించారు.

అది కూడా ఉచితంగానే. పరిస్థితి ఆందోళనకంగా ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రికి తరలించారు.

వారానికి సుమారు మూడు నుంచి అయిదు లక్షల పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనాను కట్టడి చేసే ప్రయత్నాని ఆమె సమర్ధవంతంగా నిర్వహించారు.

అందుకు ఫలితంగా వైరస్‌ వ్యాప్తి అంతగా విజృంభించలేదు. మరణాలు కూడా తక్కువగానే నమోదయ్యాయి.

జర్మనీ సరిహద్దులోని డెన్మార్క్‌ దేశ ప్రధాని ఫ్రెడరిక్‌ సేన్‌. పిన్న వయసులోనే ప్రధాని పదవి అలంకరించారు.

వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెకు మంచి పేరుంది. కఠిన చర్యలు తీసుకోవడంలోను ఆమె ముందుంటారు.

కరోనా వ్యాప్తిని గమనించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సిద్ధమయ్యారు. మార్చి మాసంలోనే లాక్‌డౌన్‌ విధించారు. దేశ సరిహద్దులిన మూసివేశారు.

భౌతిక దూరం పాటించేందుకు ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించి వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు తగ్గించడంలో తీవ్ర కృషి చేశారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఆంక్షలు సడలిస్తున్నారు. రోజూ పదివేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.

ప్రజలు పాటించిన వ్యక్తిగత క్రమశిక్షణ వల్లే తమ దేశం కరోనా వ్యాప్తి అరికట్టగలిగిందంటారామె. డెన్మార్క్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేశారు.

పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు యధావిధిగా కొనసాగిస్తున్నారు.

ప్రపంచంలో సంతోషంగా ఉండే దేశం ఫిన్‌లాండ్‌ అంటారు. అలాంటి దేశంలో కూడా కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది.

మొదట్లోనే మూడు వందల కేసులు నమోదవ్వడంతో దేశంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించారు దేశ ప్రధాని సన్నామారిన్‌.

చిన్నవయసులో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టినప్పటికి దేశాధినేతగానే కాక తల్లిగా ముందు చూపుతో వ్యవ హరించారు.

ఇతర దేశాల నుండి రాకపోకల్ని నిషేధించారు. అన్ని రకాల ప్రయాణాల్ని ఆపివేయించారు.

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశారు. పిల్లలకు వర్చువల్‌ క్లాసులు కొనసాగించారు. వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వైద్య వ్యవస్థను బలోపేతం చేసి కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తన పాత్రను సమర్ధంగా నిర్వహించారు.

కరోనా వ్యాపిస్తున్న సమయంలో నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్‌ సరైన నిర్ణయాలు తీసుకున్నారు.

తమ నిర్ణయాలను ప్రజలకు అర్ధమయ్యేలా తెలుపగలిగారు.

ఫిబ్రవరి చివరి వారంలోనే నార్వేలో మొదటికేసు నమోదయింది.

తరువాత కేసులన్నీ ఆస్ట్రియా, ఇటలీ దేశాల నుంచి వచ్చిన పర్యాటకుల వల్ల కావడంతో భౌతిక దూరం విధించారు. ప్రయాణ ఆంక్షలు కఠినం చేశారు.

ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ విధించారు. నెలన్నర రోజుల్లో రెండు లక్షల పరీక్షలు నిర్వహించారు.

బాధితులు త్వరగా కోలుకునేలా చర్యలు చేపట్టారు.

అక్కడ మరణాల రేటు తక్కువగా నమోదయింది. ఐస్‌లాండ్‌ జనాభా మూడున్నర లక్షలకు పైనుంటుంది. దేశ జనాభాలో 12 శాతం మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

కరోనాతో ప్రపంచదేశాల్లో వేలసంఖ్యలో మృత్యువాత పడుతుంటే ఇక్కడ పది మాత్రమే నమోదయ్యాయి.

ఇందుకు దేశ ప్రధానమంత్రి 44 యేళ్ల కత్రిన్‌ జాకబ్స్‌ డాట్టిర్‌ చేపట్టిన చర్యలే కారణం.

కొవిడ్‌పై ఆరోగ్యశాఖాధికారులు, అంటువ్యాధి నిపుణులు, శాస్త్రవేత్తలతో పెద్దఎత్తున సమీక్షలు నిర్వహించారు.

వారి సూచనలను పక్కాగా అమలు చేశారు. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ సడలించారు. పాఠశాలలు, కార్యాలయాలు తెరిచారు.

పాఠశాలలు, కళాశాలలు రోజుకు రెండు గంటలు చొప్పున క్లాసుకు 20 మంది విద్యార్థుల చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నారు.

కరోనాను విజయవంతంగా అడ్డుకుని పర్యాటక, వ్యాపార రంగాలు పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రధాని కత్రిన్‌ ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/