ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలు

ఏప్రిల్ 4 దాకా : సిఎస్ నీలం సాహ్ని

Work from Home' for AP Government Employees
Work from Home’ for AP Government Employees

Amaravati: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులు మినహా మిగతా వారిని రెండు టీమ్ లుగా విభజించింది.

గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 60ఏళ్లు పైబడిన సలహాదారులు, చైర్ పర్సన్లు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

50 ఏళ్లు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు ఇంటి నుంచే సేవలు అందించే అవకాశం కల్పించింది.

ప్రభుత్వ ఉద్యోగులలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   ఏప్రిల్ 4వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పంచాంగం కోసం: https://epaper.vaartha.com/2600920/Sunday-Magazine/22-03-2020#page/1/1