స్వీయ నిర్బంధంలో విండీస్‌ మాజీ కెప్టెన్‌

14 రోజులపాటు సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో

Daren sami

వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌సామీ స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌లో ఆడేందుకు అక్కడికి వెళ్లిన డారెన్‌సామీ తాజాగా వెస్టిండీస్‌ గడ్డపై అడుగుపెట్టాడు.

దీనితోప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 14రోజులపాటు సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు సామీ వెల్లడించాడు.

విదేశాలనుంచి వచ్చిన వారు కనీసం రెండువారాలపాటు స్వీయనిర్బంధంలో ఉండాలని అన్నిదేశాలప్రభుత్వాలు ఇటీవల ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్‌ వ్యాప్తినేపథ్యంలోపాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ అర్థాంతరంగా నిలతిచిపోగా వెస్టిండీస్‌కి డారెన్‌సామిని పంపనించేముందు ఆతనినుంచి శాంపిల్స్‌ సేకరించిన పాక్‌ అధికారులు పరీక్షలునిర్వహించారు.

వీటిలో నెగిటివ్‌ఫలితాలు వచ్చినా తాను స్వీయనిర్బంధంలో కొనసాగాలనే నిర్ణయించుకున్నట్లు సామి వెల్లడించాడు.

పాకి స్థాన్‌లో సామితోపాటు మొత్తం 128 మందికి పాకిస్తాన్‌క్రికెట్‌బోర్డు పరీక్షలు నిర్వహిస్తే అందరికీ నెగిటివ్‌ఫలితాలే వచ్చాయి.

పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌లో డారెన్‌సామీ ఆశించినమేర సత్తాచాటలేకపోయాడు. టోర్నీలో నాలుగుమ్యాచ్‌లు ఆడిన సామి 44 పరుగులుచేసి ఒకే ఒక వికెట్‌మాత్రమే పడగొట్టాడు.

అయితే ఇటీవల ఆతనికి పాకిస్థాన్‌ గౌరవ పౌరసత్వం ఇచ్చినసంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/