కేజ్రీవాల్‌ మరో నిర్ణయం!

పెట్రోల్ పై 3 శాతం ..డీజిల్ పై 13.25 శాతం వ్యాట్ పెంపు

arvind kejriwal
arvind kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పై ప్రస్తుతం వసూలు చేస్తున్న 27 శాతం వ్యాట్ ను 30 శాతానికి పెంచింది. డీజిల్ పై వ్యాట్ ను 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచేశారు. ఈ రాత్రి నుంచి వ్యాట్ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. కాగా కరోనా ఫీజు పేరుతో మద్యంపై 70 శాతం అదనపు పన్నును విధిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/