సీనియర్‌ పాత్రికేయుడు ‘పొత్తూరి’ కన్నుమూత

Potturi Venkateswara Rao (File)

Hyderabad: ప్రముఖ సీనియర్‌ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) ఇవాళ తన నివాసంలో కన్నుమూశారు.. జర్నలిజంలో దాదాపు 5 దశాబ్దాలకు పైగా ఆయన సేవలు అందించారు. 1934 ఫిబ్రవరి 8న ఆయన గుంటూరుజిల్లా పొత్తూరులో జన్మించారు..1957లో ఆంధ్ర జనతా పత్రికతో ఆయన పాత్రికేయ ప్రస్థానం ఆరంభమైంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.తెలుగు ప్రముఖ పత్రికల్లో ఆయన పనిచేశారు..అంతేకాకుండా పలు పుస్తకాలను రచించారు. భారత ప్రధాని దివంగత పివి నరసింహారావు గురించిన రాసిన ‘ఇయర్స్‌ ఆఫ్‌ పవర్‌కు సహరచయితగా పనిచేశారు.. అదేవిధంగా ”చిరస్మరణీయులు పుస్తకాన్ని రచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/