కరోనాపై సలహాలు అందించిన సానియా

Sania Mirza
Sania Mirza

హైదరాబాద్‌: దేశంలో కరోనా విజృభిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు, కరోనా వైరస్ కు సంబంధించి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పలు సలహాలు ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తోందని… దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పింది. వైరస్ సోకకుండా నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలని సానియా తెలిపింది. హెల్ప్ లైన్ నంబర్ 104కు ఫోన్ చేసి వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని సూచించింది. కరోనా లక్షణాలు ఉంటే ఐసొలేషన్ వార్డులో చేరి 14 రోజుల పాటు చికిత్స పొందాలని చెప్పింది. ఈమేరకు సానియా ఓ వీడియోను విడుదల చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/