భారత అథ్లెట్‌లకు డిజిటల్‌ తరగతులు

టీఓపీఎస్‌ ద్వారా నిర్వహణ.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ

kiran rijiju
kiran rijiju

దిల్లీ: అతి త్వరలోనే భారత అథ్లెట్‌ల కోసం డిజిటల్‌ తరగతులు ప్రారంభిస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టార్గెట్‌ ఒలంపిక్‌ పోడియం పథకం (టీఓపిఎస్‌) కింద దీనిని నిర్వహించనున్నామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. ఇది ప్రత్యేకంగా టీఓపిఎస్‌ అథ్లెట్‌ల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం. దీనిలో ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,చట్టపరమైన విషయాలు వంటి ఆఫ్‌ఫీల్డ్‌ నైపుణ్యాలు నేర్పిస్తారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/telangana/