దేశంలో కరోనా కేసులు 649, మరణాలు 13

వెల్లడించిన ఆరోగ్య సంక్షేమ శాఖ

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా నివారణ చర్యలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ, కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 649 కి చేరిందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ తెలిపింది. కాగా దీని బారిన పడి ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు అత్యధికంగా మహరాష్ట్రలో 124 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కేరళలో ఈ సంఖ్య 118 చేరింది. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 41 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/