చంద్రబాబు ఆస్తులపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఫై లక్ష్మి పార్వతి స్పందన

,

మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అయితే ఈ దాఖలు సుప్రీం కోర్ట్ కొట్టివేసింది.”ఇతరుల ఆస్తుల వివరాలతో మీకేం పని? అన్ని అంశాలు పరిశీలించే కదా గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది” అంటూ కాస్త గట్టిగానే హెచ్చరించింది. కాగా ఈ తీర్పు ఫై లక్ష్మి పార్వతి స్పందించారు.

ఒక్కో కోర్టు ఒక్కో విధంగా తీర్పునిస్తోందని, ఒక్కో మనిషికి ఒక్కో న్యాయమా? అని ఆమె వాపోయారు. మరొకరి ఆస్తులపై ప్రశ్నించడానికి మీరెవరు? అంటూ సుప్రీంకోర్టు నన్ను ప్రశ్నించింది. మరి జగన్ ఆస్తులపై ప్రశ్నించడానికి శంకర్ రావు ఎవరు? టీడీపీ నేతలకు ఏం పని? 2జీ స్పెక్ట్రమ్ కు సంబంధించిన కేసులో సుబ్రహ్మణ్యం ఎవరు? కోర్టు ఈ అంశాలను కూడా పరిగణించి నా పిటిషన్ పై తీర్పునిస్తే బాగుండేది అని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు.