లాడ్ బ‌జార్ లోని బ‌ట్ట‌ల దుకాణంలో అగ్నిప్రమాదం

laad-bazaar-two-storey-building-frames-near-bottle-shop-charminar

హైదరాబాద్ : నగరంలోని చార్మినార్‌ లాడ్‌బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండంతస్తుల భవనంలోని ఓ బ‌ట్ట‌ల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్ర‌మంగా ఆ మంట‌లు షాప్ మొత్తం విస్త‌రించాయి. దాంతో ఆ దుకాణం మంట‌ల‌కి ఆహుతి అయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. షాట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/