కువైట్‌లో ఒక్కరోజే 604 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల సంఖ్య 38,678

Corona-cases-in-Telangana
Corona-cases

కువైట్‌: కరోనా వైరస్‌ కువైట్‌లో క‌ల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఈ వైర‌స్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. శుక్ర‌వారం కూడా 604 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 38,678 మంది కరోనా బారిన ప‌డ్డార‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. నిన్న ఒకేరోజు 678 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 30,190కు చేరింది. అలాగే శుక్ర‌వారం సంభ‌వించిన ఐదు మ‌ర‌ణాల‌తో క‌లిపి కువైట్‌లో మొత్తం 313 మంది మృతిచెందారు. మ‌రోవైపు ఈ వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కువైట్ ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశవ్యాప్తంగా 349,412 క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/