రాహుల్ గాంధీ తో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని క‌లిశారు . కాగా ఆ స‌మ‌యంలో కోమ‌టిరెడ్డితో పాటు మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను గురించి కోమటిరెడ్డి, రాహుల్ గాంధీకి వివరించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై బయటకు వస్తోన్న సందర్భంలో గేట్ నెంబర్ వన్ వద్ద రాహుల్ ని నేతలు కలిసారు.

రాష్ట్రంలోని తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ చర్చలో భాగంగా సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు రాష్ట్ర సీనియర్ నేతలకు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అయితే కాంగ్రెస్ సీనియర్లకు అధిష్టానం అపాయింట్మెంట్ దొరక్కపోవడం మళ్లీ వెనక్కి వచ్చారు. దీంతో ఈ అంశం పార్టీలో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ వీటిన్నింటిని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు స‌మాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/