కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం

ఓపెనర్ నితీశ్ రాణా(80),రాహుల్ త్రిపాఠి(53) రాణింపు

Kolkata Knight Riders win
Kolkata Knight Riders win

Chennai: ఐపీఎల్ 2021 లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ ‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ నితీశ్ రాణా(80: 56 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సులు), శుభ్‌మన్ గిల్(15: 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాహుల్ త్రిపాఠి(53: 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి రాణా చెలరేగాడు. ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 15 ఓవర్లలోనే 145 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. దినేశ్ కార్తిక్(22 నాటౌట్: 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) చేసాడు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

188 పరుగులు లక్ష్యం తో బరిలోకి దిగిన సన్ రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌(3) ఆ తరువాతి ఓవర్లో మరో ఓపోనర్ వృద్ధిమాన్ సాహా(7)ను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మనీష్ పాండే(61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), బెయిర్ స్టో(55: 40 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సులు) ఆడారు. 13వ ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని కట్ చేయబోయిన బెయిర్ స్టో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రాణా చేతికి క్యాచ్ ఇచ్చాడు. మనీష్ పాండే నాటౌట్‌గానే నిలిచినా. 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/