10 ఏళ్ల క్రితమే చంద్రబాబుకు పవన్ దత్త పుత్రుడు అయ్యాడు – కొడాలి నాని

AP Minister Kodali Nani
AP Minister Kodali Nani

మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , చంద్రబాబు లపై విరుచుకపడ్డారు. చంద్రబాబు కు పవన్ దత్త పుత్రుడు ఇప్పుడు కాదు పదేళ్ల క్రితమే అయ్యాడని నాని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల సమస్యల్ని తెలుసుకుంటామని, మూడేళ్ళలో చేసిన కార్యాక్రమాలు ప్రజలకు వివరిస్తామని, 2024 తర్వాత మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించాలన్న అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రభుత్వం, పార్టీ కలిసి పనిచేస్తామని, చిన్న, చిన్న సమస్యలు పరిష్కరిస్తామని, ఎంత మంది కలిసి పోటీ చేసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని స్పష్టం చేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూసి భయపడేది లేదని, వాళ్ళలో వాళ్ళకే ధైర్యం లేదని విమర్శించారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు చేశామన్న కొడాలి నాని.. చంద్రబాబు, పవన్ ఎప్పుడు విడిపోయారో చెప్పండి.. ఎన్నికల ముందు పార్టీ పెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అన్నారు. పవన్ పదేళ్ళ క్రితమే చంద్రబాబుకు దత్త పుత్రుడు అయ్యాడని, లోకేష్ ఒక చోట ఢింకీ కొడితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల డింకీలు కొట్టాడన్నారు. వాళ్ళిద్దరి విడిపోయిందే లేదని, చంద్రబాబు జీవితమే మోసం, కుట్ర, 420, దగా అంటూ ధ్వజమెత్తారు.