హైకోర్టు తీర్పు తమకు బాధ కలిగించింది: మంత్రి బొత్స

సెంటు భూమిలో ఇంటి నిర్మాణంపై హైకోర్టు తీర్పు

అమరావతి : సెంటు భూమిలో ఓ ఇల్లు కట్టడం సాధ్యామేనా? అని హైకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గృహ నిర్మాణం కోసం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర భూమి సరిపోదని, దీనిపై ప్రత్యేక కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలని హైకోర్టు నిన్న పేర్కొంది. అంతేకాదు, కమిటీ అధ్యయనం పూర్తయ్యేవరకు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది.

దీనిపై మంత్రి బొత్స మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఇది రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అయితే కోర్టు తీర్పుకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రతి మహిళ సొంతింటి కలను నెరవేర్చేందుకే ఇళ్ల పథకం తీసుకువచ్చామని వెల్లడించారు. ఇలాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు తమకు బాధ కలిగించిందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/