అల్లూరి జయంతి వేడుకలకు చంద్రబాబుకు ఆహ్వానం

chandrababu

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. జులై 4వ తేదీన ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా జరిగే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాలని..చంద్రబాబుకు లేఖ రాశారు. ఆహ్వాన లేఖతో పాటు కిషన్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ చెప్పారు. అయితే ఈ వేడుకలకు టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరు కానున్నారని తెలుస్తుంది.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని.. జూలై 4న ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహం ఆవిష్కరిచనున్నారు. అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మున్సిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అల్లూరి విగ్రహాన్ని దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువుతో ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల జీవితాలను ప్రజలకు వివరిస్తామని.. అల్లూరి సీతారామరాజు తరహాలో ఎంతో మంది త్యాగాలను మోడీ వివరించనున్నారు. ఈ కార్యక్ర‌మానికి రావాలంటూ ఇప్ప‌టికే టాలీవుడ్ అగ్ర హీరో, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కూడా కిష‌న్ రెడ్డి ఆహ్వానం ప‌లికిన సంగ‌తి తెలిసిందే.