ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ ఫై కిష‌న్ రెడ్డి ఏమన్నారంటే

కేంద్ర మంత్రి అమిత్ షా – సినీ నటుడు ఎన్టీఆర్ ల భేటీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ కు దారితీసింది. ఈ భేటీ వెనుక పెద్ద రాజకీయ కోణమే ఉందని అంత మాట్లాడుకుంటున్న వేళ..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి దాడిచేసి వందేళ్లు పూర్తయిన దృష్టా శత జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌ముండా , ఏపీ డిప్యూడీ సీఎం రాజన్న దొర హాజరయ్యారు. సందర్భంగా 9 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మీడియాతో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య భేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు. రాజ‌కీయాల‌కు ఏమాత్రం సంబంధం లేని స‌మావేశమ‌దని ఆయ‌న తెలిపారు. ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీలో వారిద్ద‌రూ కేవ‌లం సినిమాల‌కు సంబంధించిన అంశాల‌పైనే మాట్లాడుకున్నార‌ని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ భేటీలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ గురించిన విష‌యాల‌ను అమిత్ షా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను అడిగి మ‌రీ తెలుసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి డిన్న‌ర్ చేయాల‌ని అమిత్ షా భావించార‌న్నారు. ఈ భేటీలో రాజ‌కీయ ప్రాధాన్యం ఉందంటూ వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై తానేమీ స్పందించ‌బోన‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.

నిన్న మునుగోడు బీజేపీ సభ లో అమిత్ షా పాల్గొన్నారు. సభ ముగిసిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ లో రామోజీరావు ను కలిశారు. అనంతరం ఢిల్లీకి తిరిగి బ‌య‌లుదేరే ముందు శంషాబాద్ ప‌రిధిలోని నోవాటెల్ హెట‌ల్‌లో ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఫై ఇరువురు ట్విట్టర్ ద్వారా పోస్టులు చేయడం జరిగింది. అయినప్పటికీ చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.