ఫోర్బ్స్ జాబితాలో ‘కీర్తి’ సురేష్

సౌత్ ఇండియా నుంచి ‘మహానటి’ కి మాత్రమే చోటు

Keerthy Suresh on Forbes list
Keerthy Suresh

గత ఏడాది ఇండియాలో అత్యంత ప్రతిభాశీలురైన నటీమణుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. మొత్తం 30 మందితో కూడిన జాబితా రిలీజ్ చేయగా.. అందులో కీర్తి సురేష్ కి చోటు లభించింది.

జాతీయ అవార్డు గ్రహీతగా ఇప్పటికే ఎంతో  ‘కీర్తి’ పొందిన సురేష్., ఇప్పుడు ప్రతిష్టాత్మక గౌరవాన్ని కూడా అందుకుంది. 2020 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ ఈ జాబితాను రిలీజ్ చేసింది. సౌత్ ఇండియాలో కీర్తికి మాత్రమే చోటు దక్కడం విశేషం.

ప్రతీ సంవత్సరం ఫోర్బ్స్ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ జ్యూరీ సిఫార్సులు రిసీవ్ చేసుకుంటుంది. ఈ విధంగా మూడు దశల వడపోత అనంతరం ఫైనల్ జాబితాను సిద్ధం చేస్తుంది.

ఫోర్బ్స్ జాబితాలో తన పేరు ఉండటంపై కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/