రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్

రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళ్లు అర్పించారు. అమీర్‌పేటలోని ఆయన నివాసానికి చేరుకున్న కేసీఆర్.. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రోశయ్య మృతి పట్ల ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది.

శనివారం ఉదయం రోశయ్య బిపి డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పారు. ప్రస్తుతం రోశయ్య మృతదేహాన్ని అమీర్ పేట్ లో ఆయన నివాసం ఉంచారు. రాజకీయ నేతలంతా రోశయ్య కు నివాళ్లు అర్పిస్తూ వస్తున్నారు. రేపు గంట పాటు గాంధీ భవన్ లో ప్రజల సందర్శనార్థం రోశయ్య భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.