మహిళా మహిళా ప్యాసింజర్ ఎదుటే క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పని..

ఈ మధ్య క్యాబ్ డ్రైవర్ల పాడు పనులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మహిళా ప్యాసింజర్లపై లైంగిక దాడులు చేయడం…లైంగికంగా వేధించడం వంటివి చేస్తున్నారు. పోలీసులు ఈ పనులకు పాల్పడిన వారికీ కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ పలువురు డ్రైవర్లలో మార్పు రావడం లేదు. తాజాగా బెంగుళూర్ లో ఓ క్యాబ్ డ్రైవర్ …మహిళా ప్యాసింజర్ ఎదుటే హస్తప్రయోగం చేయడం వార్తల్లో నిలిచింది. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది.

మహిళా జర్నలిస్టు తన విధులను ముగించుకుని ఇంటికి వెళ్లడం కోసం ఓలా క్యాబ్‌ బుక్ చేసుకుంది. క్యాబ్ వచ్చింది..సదరు మహిళా ఎక్కింది. కాస్త దూరం వెళ్ళగానే డ్రైవర్ జుగుప్సాకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతడు హస్త ప్రయోగం చేయడం నేను గమనించడంతో ప్యాంటును సర్దుకున్నాడు. ఆ సయమంలో నేను పోలీసులకు ఫోన్ చేయలేకపోయాను. అవును ఎమర్జెన్సీ నెంబర్ తెలుసు. కానీ, ఆ సమయంలో ఫోన్ గురించి ఆలోచించలేం అని ఆ జర్నలిస్టు తెలిపింది.

క్యాబ్ డ్రైవర్ చేస్తున్న పాడు పనిని నేను గమనించిన వెంటనే అతడు తన ప్యాంటును సర్దుకున్నాడు. ఏమి జరగన్నట్లు నటించాడు. కొద్దిపాటి ధైర్యం కూడగట్టుకుని కేకలు వేసి కారును ఆపేలా చేశాను. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో సరిగ్గా లైట్లు లేని రోడ్డులో కారు ఉన్నది. డ్రైవర్ కారును ఆపాడు. నేను దిగగానే వెళ్లిపోయాడు. అని ఆ మహిళా జర్నలిస్టు తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సంఘటనపై ఓలా యాజమాన్యం స్పందించింది. ఆ క్యాబ్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించి..పోలీసులకు పిర్యాదు చేసారు.