లిక్కర్ కేసులో కవిత అనుమానితురాలు – ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అనుమానితురాలుగా ఈడీ కోర్ట్ కు తెలిపింది.కవిత ను పిళ్ళై తో కలిపి విచారణ చేయాలనీ ఈడీ కోర్ట్ కు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కవిత..ఈ నెల 11 న ఈడీ ముందు హాజరు కాగా..దాదాపు 09 గంటలపాటు అధికారులు విచారించారు. ఆ తర్వాత ఈరోజు (మార్చి 16 న ) మరోసారి హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీచేసింది. కానీ ఈరోజు ఈడీ ముందు కవిత హాజరుకాలేదు.

ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటామని కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ చెప్పారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లను అందజేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు కవిత వేసిన పిటిషన్ పై ఈనెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కానీ దాని కంటే ముందే 20న హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. ఈరోజు ఈడీ ఆఫీసుకు వచ్చేందుకు నిరాకరించిన కవిత.. 20న మాత్రం విచారణకు హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈడీ అధికారులు కోర్ట్ కు ఈ కేసులో కవితను అనుమానితురాలుగా మాత్రమే చూస్తున్నట్లు తెలిపింది. కవిత ను పిళ్ళై తో కలిపి విచారణ చేయాలనీ ఈడీ కోర్ట్ కు తెలిపింది.