ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం..

యువకుడిని కిరాతకంగా కాల్చి చంపి, మార్కెట్లో వేలాడదీసిన వైనం

taliban-killed-young-man

కాబుల్‌ః ఆఫ్ఘనిస్థాన్ లోని బగ్లాన్ ప్రావిన్స్ లో అందరాబ్ జిల్లాలో ఒక యువకుడని తాలిబన్లు కాల్చి చంపారు. అనంతరం… అతని మృతదేహాన్ని మార్కెట్ దగ్గరకు తీసుకెళ్లి బహిరంగంగా వేలాడదీశారు. ఈ దారుణ ఘటన అందరికీ ఒళ్లు జలదరించేలా చేస్తోంది.

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… కసా తరాష్ ప్రాంతంలోని అందరాబ్ లో ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఈ నెల 20న అతని వద్దకు తాలిబన్లు వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు రావాలని ఆదేశించారు. అతను బయటకు వచ్చిన వెంటనే కాల్చి చంపారు. అతని ఇంటి ముందు నిలబడిన జనాలను చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

అనంతరం డెడ్ బాడీని తీసుకొచ్చి మార్కెట్ వద్ద వేలాడదీసి దుశ్చర్యకు పాల్పడ్డారు. అతన్ని ఎందుకు హతమార్చారనే విషయం మాత్రం తెలియరాలేదు. అనంతరం మృత దేహంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తర్వాత చాలామందిని చంపేశారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/