డీటాక్స్‌ సలాడ్‌

రుచి: వెరైటీ వంటకాలు

Detox Salad‌
Detox Salad‌

పొట్టను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరాన్ని రిఫ్రెష్‌ చేస్తుందంటున్నారు నిపుణులు. మరి ఈ సలాడ్‌ ఎలా తయారుచేయాలో చూద్దామా మరి!

కావలసిని పదార్థాలు

పాలకూర – 120 గ్రాములు
చిన్న టమోటాలు – 60 గ్రాములు
గ్రీన్‌ ఆలివ్‌ గింజలు – 25 గ్రాములు
కమలాపండు ముక్కలు – 20 గ్రాములు
బ్రకోలి ముక్కలు – 80 గ్రాములు
పియర్స్‌ పండు ముక్కలు – 50 గ్రాములు
అవకాడో ముక్కలు – 50 గ్రాములు
వేగించిన పొద్దు తిరుగుడు పువ్వు గింజలు – 10 గ్రాములు
గుమ్మడి గింజలు – 10 గ్రాములు,
తేనె 50 గ్రాములు
వెనిగర్‌ – 5 మిల్లీలీటర్లు
ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ నూనె – 60 గ్రాములు

తయారు చేసే విధానం

ాలకూర ఆకులను శుభ్రంగా కడిగి వాటిని పేపర్‌ టవల్‌ మీద పెట్టాలి. బ్రకోలి ముక్కలను ఉప్పు వేసి మరిగించిన నీటిలో 30 సెకండ్లు ఉంచి తీయాలి.

ఆ తరువాత చిన్న పాత్ర తీసుకుని పాలకూర, చెర్రీ టమోటా, ఆలివ్‌ గింజలు, బ్రకోలి ముక్కలు వేసి కలపాలి.

వాటిపైన కమల పండు ముక్కలు, అవకాడో, పియర్స్‌ ముక్కలు వేయాలి. ఈ సలాడ్‌ పైన బ్లూ బెర్రి ముక్కల, దానిమ్మ గింజలు, కమలాఫలం ముక్కలు సలాడ్‌ పై భాగంలో వేయాలి.

తర్వాత వేగించిన గింజలను వాటిపైన చల్లి తింటే శరీరం చక్కగా డీటాక్స్‌ అవుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/