ముందుకు సాగాల్సిన సమయం .. చీర్ లీడర్ గా ఉంటా

ట్రంప్ వ్యాఖ్య

Donald Trump
Donald Trump

కరోనా భయంతో ఎంత కాలం అమెరికాను మూసి ఉంచుతామని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు.

ట్రంప్ ఆరిజోనాలోని ఫినిక్స్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తివేయడం వల్ల ఎక్కువ మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంగీకరించారు.

అయినా సరే అమెరికాను తెరవక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని, అందుకు తాను చీర్ లీడర్ గా ఉంటానని ట్రంప్ అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం:https://www.vaartha.com/news/business/