కోల్‌కతాలో బిజెపి ఉద్రిక్తతలు

కోల్‌కతా: పశ్చిమబంగాల్‌లో బిజెపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన ‘నబన్నా చలో’ యాత్ర ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నబన్నా చలో లోని సచివాలయానికి చేరుకోవాలని భావించారు. అయితే, పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ కోల్‌కతా, హేస్టింగ్స్, హౌరా తదితర ప్రాంతాల్లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆపై వాటర్ క్యానన్‌లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో హౌరాలో నిరసనకారులు రెచ్చిపోయారు. హౌరా ప్రధాన కూడలిలో టైర్లు తగులబెట్టి నిరసన వ్యక్తంచేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/