ప్రజలే ప్రభుత్వానికి ఇంటర్వెల్ ఇస్తారు :’కన్నా’

మంత్రి ‘పెద్దిరెడ్డి’ కి భాజపా నేత ‘కన్నా’ కౌంటర్

Kannalakshmi Narayana counter to Peddy Reddy
Kannalakshmi Narayana counter to Peddy Reddy

Amaravati: ఏపీలో 3 రాజధానుల బిల్లు ఉపసంహరణపై .. ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, ఇంకా శుభంకార్డు పడలేదని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. అదే జరిగితే ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడుతుందని అన్నారు. . ప్రజలే ప్రభుత్వానికి ఇంటర్వెల్ ఇస్తారని హచ్చరించారు. మూడు రాజధానులు నిర్ణయం అహంకారపూరితంగా తీసుకున్నదని, దీన్ని వెనక్కి తీసుకోక తప్పదని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఏపీకి రాజధాని ఏదనేది ఎప్పుడో నిర్ణయం జరిగిపోయిందన్నారు. ఎంతో ప్రజాధనాన్ని రాజధానిపై వెచ్చించారని చెప్పారు. 30 వేల మందికి పైగా రైతులు తమ భూములు ఇచ్చారని తెలిపారు.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/