కాజల్ తన కొడుకు కు ఏ పేరు పెట్టిందో తెలుసా..?

చందమామ ఫేమ్ కాజల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు రావడం తో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆమెకు విషెష్ అందజేయడం స్టార్ట్ చేసారు.అలాగే కాజల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దీనికి సంబంధించి కాజల్​ భర్త గౌతమ్​ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తమకు పుట్టిన బిడ్డకు నీల్‌ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్లు కాజల్​ భర్త గౌతమ్‌ తెలిపారు.

చందమామ ఫేమ్ కాజల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. లక్ష్మి కళ్యాణం మూవీ తో తెలుగు లో హీరోయిన్ గా పరిచమైన కాజల్..మగధీర , చందమామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోల సరసన నటించి అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది.

చిత్రసీమలో రాణిస్తూనే ముంబయి వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడి.. 2020 అక్టోబర్ 30 తేదీన సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆచార్య సినిమా షూటింగ్​లో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్రెంట్ అయ్యింది. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇటీవల కాజల్ బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.