చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 73 వ వసంతంలోకి చంద్రబాబు అడుగుపెట్టారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు , అభిమానులు ఉదయం నుండి చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పలు సేవ కార్య క్రమాలు చేపడుతున్నారు. సినీ , రాజకీయ నేతలు సైతము సోషల్ మీడియా లో చంద్రబాబు కు బెస్ట్ విషెష్ అందజేశారు. ఇక సీఎం జగన్ సైతం సోషల్ మీడియా ద్వారా… చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు.. ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

ఇదిలా ఉంటె పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ప్రజల తరఫున పోరాడే శక్తి, సామర్థ్యం ఇవ్వాలని, ప్రజల పక్షాల నిలబడి, ప్రజలకు ఉండే ఇబ్బందులను తొలగించే తెలివి తేటలను ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

తాత్కాలిక ఇబ్బందులను, దీర్ఘకాలంలో తెలుగుజాతికి పూర్వ వైభవం రావాలని కోరుకున్నానని, తప్పకుండా ఈ విషయంలో విజయసాధిస్తామన్నారు. ప్రజలకు పునరంకితం కావాలని , ప్రజలకు అండగా నిలవడానికి రాజీలేని పోరాటం చేసేందుకు ఆలయానికి వచ్చానని తెలిపారు.