వాటర్ రిసార్ట్ కింద హనీమూన్ పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘చందమామ’

kajal-Gautam Kitchlu -Honey mooning Under water Resort pic
kajal-Gautam Kitchlu -Honey mooning Under water Resort pic

కాజల్ సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా 15 రోజుల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది. గత నెల 30న గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మాల్దీవుల్లో హనీమూన్ లో ఉంది.

పెళ్లికి ముందు నుండి సంగీత్.. ఇంకా ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూనే ఉన్న కాజల్ హనీమూన్ ఫొటోలను కూడా రెగ్యులర్ గా షేర్ చేస్తూనే ఉంది.

రొమాంటిక్ ఫొటో షూట్ ను షేర్ చేస్తున్న కాజల్ ఈసారి బెడ్ రూం పిక్ తో వైరల్ అయ్యింది.

చుట్టు నీరు మద్యలో గౌతమ్ తో కాజల్ చాలా రొమాంటిక్ ఫోజ్ తో ఈ ఫొటోలో చూడవచ్చు.

సాదారణంగా సెలబ్రెటీలు ముఖ్యంగా స్టార్స పెళ్లి అయినప్పుడు సోషల్ మీడియాలో హడావుడి కామన్ గా కనిపిస్తుంది.

కాజల్ మాత్రం గత పది హేను రోజులుగా ట్రెండ్ అయ్యేందుకు ఫొటోలను షేర్ చేస్తుంది. మొదట పెళ్లి ఫొటోలు.. ఆతర్వాత పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్..

ఇప్పుడు హనీమూన్ ఫొటోలతో తన ఫాలోన్స్ ను,నెటిజన్స్ మతి పోగొడుతోంది. 

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/