సోషల్ మీడియా ప్రచారం ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన కైకాల కూతురు

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం తో అపోలో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం బాగానే ఉందని ..అందరితో మాట్లాడడం , గుర్తుపట్టడం చేస్తున్నారు. హాస్పటల్ లో చేరిన క్షణం ఆయన పరిస్థితి విషమంగా ఉండే..కానీ వైద్యులు సకాలంలో వైద్యం అందించి ఆయన్ను కోలుకునేలా చేసారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం ఫై ఆయన కూతురు రమాదేవి స్పందించింది.

నాన్నగారి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగైంది. అందరితోనూ మాట్లాడుతున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దయచేసి అనవసర వార్తలతో జనాలను ఆందోళనకు గురి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అపోలో ఆసుపత్రి వైద్యులు కైకల సత్యనారాయణ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో వెంటిలేటర్ పై కైకల సత్యనారాయణ కు వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్తపోటు తగ్గిందని కిడ్నీ పనితీరు చాలా మెరుగుపడిందని… త్వరలోనే ఆయన కోలుకుంటారని బులెటిన్లో పేర్కొన్నారు.