రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపబోతున్న జగన్

రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపేందుకు జగన్ సర్కార్ సిద్దమవుతుంది. మోటారు వాహనాల పన్ను చట్టం 1963లో సవరణలకు అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు. వాహనాల లైఫ్‌టాక్స్, గ్రీన్‌టాక్స్ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నూతన వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో… ఇకపై 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. ద్రవ్యోల్బణం, రహదారుల భద్రత, కాలుష్య నియంత్రణ కోసం టాక్స్‌లు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కేబినెట్‌లో ఆర్డినెన్స్‌ను ఆమోదించారు. ఈ పన్నులకు సంబంధించి పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది.
వాహన మిత్ర పేరుతో కొద్ది మందికే పథకం వర్తించింది. రాష్ట్రంలో ఇప్పటికే కోటి 31 లక్షల వాహనాలు – 1.15 కోట్ల రవాణాయేతర వాహనాలున్నాయి.6 2010లో చివరి సారిగా పన్నుల్లో సవరణ చేయనున్నారు. రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల్లో రవాణా శాఖ ఆదాయమే కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం 15 బిల్లులను ప్రవేశపెట్టనుంది. సినిమా రెగ్యులరైజేషన్ యాక్ట్‌తో పాటు పలు బిల్లులు సభ ముందుకు రానుంది. అలాగే బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. శాసన మండలి రద్దు చేయాలన్న గత తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసే అవకాశం ఉంది. అలాగే మండలిలో పరిపాలనా వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.